కేటీపీఎస్‌లో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
ఖమ్మం,(జనంసాక్షి): కేటీపీఎస్ నాలుగో యూనిట్లో సోమవారం సాంకేతిక లోపం ఏర్పడింది. ఈ కారణంగా 60 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దాంతో నాలుగో యూనిట్లో ఏర్పడిన లోపాన్ని కనుగొని, విద్యుత్ ఉత్పత్తిని పునరుద్దరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.