వరదలో కొట్టుకుపోయిన పోలీసుల తుపాకులు
ఖమ్మం: జిల్లాలోని వెంకటాపురం మండల పరిధిలోని శంకవాగులో పోలీసు బలగాలకు చెందిన రెండు ఎస్‌ఎల్‌ఆర్ తుపాకులు గల్లంతయ్యాయి. మంగళవారం రాత్రి అడవుల్లో స్పెష్టల్ పార్టీ పోలీసులు కూంబింగ్‌కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో శంకవాగు దాటుతుండగా ముగ్గురు పోలీసులు నీటి ఉదృతికి కొట్టుకుపోయారు. ఆ వరదలో తుపాకులు నీటిలో వదిలి పోలీసులు సురక్షితంగా బయటపడ్డారు. తుపాకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.