ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన బొత్స

విశాఖ: తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 2700 మంది కాంగ్రెస్‌ మద్దతు దారులు విజయం సాధించారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2014 ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందనడానికి ఫలితాలే నిదర్శనమన్నారు. సంక్షేమ కార్యక్రమాలు సమర్థంగా అమలు చేసేవారినే ప్రజలు ఎన్నుకున్నారన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలా, విభజించాలా అనేది రాజకీయాలకు సంబంధం లేదన్నారు. ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదని, సకాలంలోనే ఎన్నికలు జరుగుతాయని బొత్స చెప్పారు.