ముంపు ప్రాంతాలను పరిశీలించిన దత్తాత్రేయ

భద్రాచలం: ఖమ్మం జిల్లాలో గోదావరి వరద నీటిలో చిక్కుకున్న గ్రామాలను భా.జ.పా జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ బుధవారం ఉదయం పరిశీలించారు. ముంపు ప్రాంతాల ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరదల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ… బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ ఆరు బృందాలుగా ఏర్పడి వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు చెప్పారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.