ప్రారంభమైన జాతీయ సెయిలింగ్ పోటీలు
హైదరాబాద్: నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో 28వ జాతీయ లేజర్ సెయిలింగ్ ఛాంపియన్ షిప్ అట్టహాసంగా ప్రారంభమైంది. హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పేరుతో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 28 వరకు జరిగే పోటీల్లో దేశవ్యాప్తంగా వివిధ క్లబ్‌ల నుంచి సెయిలర్లు తలపడనున్నారు. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వట్టి వసంత్‌కుమార్ వీటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్మీ అధికారులు పాల్గొన్నారు. ఆర్మీ అధికారులతో కలిసి మంత్రి సాగర్‌లో బోటుపై విహరిస్తూ సెయిలర్లను ఉత్సాహపరిచారు.