చాప్రా విషాద ఘటనలో అరెస్టయిన ప్రిన్సిపల్
బీహార్,(జనంసాక్షి): చాప్రా మధ్యాహ్న భోజనం కల్తీ ఘటనలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మీనాదేవిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలు మీనాదేవిని పోలీసులు చాప్రాలో అదుపులోకి తీసుకున్నారు. మీనాదేవిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మధ్యాహ్న భోజనం తిని 23 మంది విద్యార్థులు మృత్యువాత పడిన విషయం విదితమే.