ముళ్లపొదల్లో పసికందు మృతదేహం
కోస్గి: మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి పట్టణంలో ముళ్ల పొదల్లో ఉన్న పసికందు మృత దేహాన్ని స్థానికులు గుర్తించారు. పదిరోజుల వయస్సున్న మగ బిడ్డను గుర్తు తెలియని మహిళ ముళ్లపొదల్లో వదిలేసి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. పందులు దాడిచేసి పీక్కు తినడంతో పసికందు మృతి చెందినట్లు చెబుతున్నారు. పోలీసులకు సమాచారం అందించారు.