సిండికేట్ బ్యాంక్‌లో చోరీ
మెదక్,(జనంసాక్షి): జిల్లాలోని జహిరాబాద్ మండలం మాల్చల్‌మడలో దొంగలు బీభత్సవం సృష్టించారు. సిండికేట్ బ్యాంకులో చొరబడ్డ దొంగలు నగదు దోచుకెళ్లారు. జిల్లాలోని సిండికేట్ బ్యాంకుల్లో దొంగతనం జరగడం ఇది మూడోసారి. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.