గంట గంటకు పెరుగుతున్న వరద ఉద్ధృతి

శ్రీశైలం: కృష్ణ ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో జలాశయంలో నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది. గరిష్ఠ స్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా…. జూరాల నుంచి శ్రీశైలానికి 1.37.168 క్యూసెక్కుల నీరు వస్తుండగా… తుంగభద్ర నుంచి 90,300 క్యూసెక్కుల వరద వస్తోంది. జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం 852.40 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 85.3874 టీఎంసీలుగా నమోదైంది. ఈ సీజన్లో ఇంత భారీగా వరద నీరు రావడం ఇదే మొదటిసారి. కుడిగట్టు విద్యుత్తు కేంద్రంలో 6 యూనిట్లు వినియోగించి 94 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 27,158 క్యూసెక్కుల నీటిని నాగర్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

తాజావార్తలు