ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యేలు
వరంగల్,(జనంసాక్షి): వరంగల్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కురవి మండలం గుండ్రాతిమడుగులో ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, దుగ్గొండి మండలం కేశవపురంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం 16 వ వార్డులో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.