రంగారెడ్డి జిల్లాలో పోలింగ్ కేంద్రంపై దాడి
రంగారెడ్డి,(జనంసాక్షి): శంషాబాద్ మండలం నల్లబల్లి తండా పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తమ ఓట్లు గల్లంతు అయ్యాయంటూ స్థానికులు పోలింగ్ కేంద్రంపై దాడికి దిగారు. గేట్లను పగులగొట్టి లోపలికి వెళ్లేందుకు స్థానికులు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాడికి దిగిన వారిపై పోలీసులు లాఠీలు ఝులిపించారు.