ఓట్లు గల్లంతయ్యాయని సిబ్బందిపై దాడి
ఖమ్మం,(జనంసాక్షి):కొణిజెర్ల మండలంలో పల్లిపాడులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఓట్లు గల్లంతయ్యాయని స్థానికులు ఎన్నికల విధులకు వచ్చిన సిబ్బందిపై దాడి చేశారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.