స్థానికేతరులపై స్థానికుల దాడి
ఖమ్మం,(జనంసాక్షి): ఓటు వేయడానికి వచ్చిన స్థానికేతరులపై స్ధానికులు దాడి చేశారు. ఈ ఘటన ముత్తగూడెంలో చోటు చేసుకుంది. 30 మంది స్థానికేతరులను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు.