మడగూడ ఎన్నిక వాయిదాకు సిఫార్సు చేసిన కలెక్టర్
వరంగల్,(జనంసాక్షి): కొత్తగూడ మండలం మడగూడ సర్పంచ్ ఎన్నికను వాయిదా వేయాలని జిల్లా కలెక్టర్ నిర్ణయించారు. ఈ మేరకు ఇవాళ ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘంకు సిఫార్సు చేశారు. సర్పంచ్ అభ్యర్థి పేరు తారుమారు కావడంతో ఎన్నిక వాయిదా వేయాలని ఆయన ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.