66వ రోజుకు చేరుకున్న వీఆర్ఏల నిరవధిక సమ్మె
ములుగు జిల్లా మంగపేట మండలంలో విఆర్ఏ ల నిరవధిక సమ్మె 66 వ రోజుకు చేరుకుంది. ఇట్టి కార్యక్రమంలో మండలంలో ఉన్న విఆర్ఏ లు మాట్లాడుతూ… తెలంగాణ రాష్టం మొత్తం బతకమ్మ పండగ జరుగుతుంటే విఆర్ఏ లందరికి సమ్మెతోని సరిపోతుంది అని దానితో వచ్చే రోగాలతోనే సరిపోతుంది అని వ్యాఖ్యనించారు. బంగారు తెలంగాణ అంటే ఇదే అని రాష్టంలో విఆర్ఏ లకు పండగలు లేవని సమ్మెతోనే కాలం గడిచిపోతుంది అని అన్నారు. బ్రతుకు గురించి పోరాడాల్సి వస్తుందని అన్నారు.పే స్కేల్ సాధించే వరకు విఆర్ఏ లకు పండగ లేదని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో విఆర్ఏ ల మండల అధ్యక్షుడు పాగ బాబు, ఉపాధ్యక్షుడు కర్రి నాగార్జున, ప్రధాన కార్యదర్శి కర్రి నర్సింహ మూర్తి,కోశాధికారి మాటూరి కౌసల్య,సభ్యులు నర్సింహారావు, గౌసియా బేగం,సమ్మయ్య, రాజేశ్వరి,కనుకు సమ్మక్క, పగిడమ్మా,రాణి,రాము,ఈశ్వరమ్మ, శ్రీను,మాధవి,ఖాజా హుస్సేన్, కార్తిక్,ముత్తయ్య,ఎల్లమ్మ, ముజాఫర్,వెంకటనర్సమ్మ,శిరీష, సందీప్ తదితరులు పాల్గొనడం జరిగినది.