66 మంది ఖైదీలను చర్లపల్లి జైలుకు తరలింపు
సంగారెడ్డి అర్బన్, జనంసాక్షి: సంగారెడ్డి జిల్లా జైలు నుంచి చర్లపల్లి జైలుకు 66 మంది ఖైదీలను తరలించారు. పెద్దశంకరంపేట మార్సెట్టిపల్లికి చెందిన బాణామతి కేసు విషయంలో 67మంది ఖైదీలకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 2వేలు జరిమానా విధిస్తూ మెదక్ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఖైదీలను ముందుగా సంగారెడ్డి జిల్లా జైలుకు అనంతరం శనివారం చర్లపల్లికి తరలించారు. ఖైదీలను పరామర్శించేందుకు అవకాశం కల్పించలేదంటూ వారి కుటుంబసభ్యులు పోలీసులను శాపనార్ధాలు పెట్టారు. మహిళలు కన్నీరు మున్నీరయ్యారు.