మల్కాజ్‌గిరిలో భారీ చోరీ
రంగారెడ్డి,(జనంసాక్షి): మల్కాజ్‌గిరి గౌతంనగర్‌లో భారీ చోరీ జరిగింది. ఆదాయపుపన్ను శాఖ అధికారి కృష్ణమోహన్ నివాసంలో 12 తులాల బంగారం నగలు, రూ.15 వేల నగదును గుర్తు తెలియని దుండగులు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.