ఢిల్లీ బయలుదేరిన మంత్రులు

హైదరాబాద్‌:నగరానికి చెందిన మంత్రులు దానం నాగేందర్‌, ముఖేష్‌ గౌడ్‌లు ఢిల్లీ బయలుదేరారు. హైదరాబాద్‌పై తమ అభిప్రాయాలను అధిష్ఠానానికి తెలిపేందుకు వీరు ఢిల్లీ బయలుదేరినట్లు సమాచారం. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించనున్నారనే వూహాగానాలు వస్తున్న నేపథ్యంలో మంత్రులిద్దరూ ఢిల్లీ పయనమయ్యారు.