శాసనసభ ప్రాంగణానికి చేరుకుంటున్న కాంగ్రెస్‌ నేతలు

హైదరాబాద్‌ తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా యూపీఏ సమన్వయసంఘం, సీడబ్ల్యూసీల్లో తీర్మానం చేయడం పట్ల తెలంగాణ ప్రాంతంలో హర్షం వ్యక్తమవుతోంది. ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర నేతలు కూడా రాత్రికి హైదరాబాద్‌ చేరుకోనున్నట్లు సమాచారం.