మూడో విడత పోలింగ్‌ ప్రారంభం

హైదరాబాద్‌: రాష్ట్రంలో మూడో విడత ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. 5,945 గ్రామ పంచాయతీలకు ఇవాళ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అఆంచయ ఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో మూడో విడత పోలింగ్‌ జరుగుతున్న కామారెడ్డి, ఎల్లారెడ్డిలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పోలింగ్‌ ఆటంకం కలిగే అవకాశముంది. కరీంనగర్‌ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో హుస్నాబాద్‌, హుజురాబాద్‌, మహదేవ్‌పూర్‌లో పోలింగ్‌కు ఆటంకం కలిగే అవకాశంముంది. మెదక్‌ జిల్లా సంగారెడ్డి డివిజన్‌లో. వరంగల్‌ జిల్లా ములుగు ఏజుస్సీ పరాధిలో కూడా భార్షం కురుస్తుంది. దీంతో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోలేక పోతున్నారు.