ఉత్తర భారతంలో భూప్రకంపనలు
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తర భారత దేశంలో ఈ ఉదయం పలు చోట్ల భూమి కంపించింది. జమ్మూ కాశ్మీర్‌లోని దోడా, కిష్టావర్‌లో, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, మొహాలీ, చంబా, హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రాలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఎలాంటి ఆస్తి నష్టం సంభవించలేదు.