యూరియా అందక ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు

దౌల్తాబాద్‌ గ్రామీణం: గురువారం స్థానిక వ్యవసాయ పరపతి సంఘానికి కేవలం 300 బస్తాల యూరియా వచ్చింది. వివిధ గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి మంది రైతులు వీటి కోసం ఎగబడ్డారు. ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున యూరియా అందజేశారు. కేవలం 175 మంది రైతులు వీటిని అందుకున్నారు. దీంతో మిగిలిన రైతులు నిరాశతో వెనుకకుతిరిగారు. యూరియా కష్టాలు వేధిస్తున్నా అధికారులు, ప్రభుత్వం స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.