డీజీపీ దినేష్‌రెడ్డి విఫలం: పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): సీమాంధ్రలో శాంతి భద్రతలను అదపు చేయడంలో డీజీపీ దినేష్‌రెడ్డి విఫలమయ్యారని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. ట్యాంక్‌బండ్‌ మీద విగ్రహాలను చీకటి రోజుగా అభివర్ణించిన వారు సీమాంధ్రలో రాజీవ్‌, ఇందిరా గాంధీ విగ్రహాల ధ్వంసంపై ఇప్పుడెందుకు మౌనం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాజీవ్‌, ఇందిరా విగ్రహాల ధ్వంసాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.