ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

ఇబ్రహీంపట్నం గ్రామీణం: ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం ఇబ్రహీంపట్నం మండలకేంద్రంలో చోటుచేసుకుంది. యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన సురేశ్‌ (22) ఇబ్రహీంపట్నంలో సెంట్రింగ్‌ బాక్సుల తయారీ సంస్థలో పనిచేస్తున్నాడు. పనిచేసేచోట అతను ఉరివేసుకుని మరణించాడని సీఐ రాంకుమార్‌ తెలిపారు. అతని ఆత్మహత్యకు కారణం తెలియలేదు.