అస్వస్థతకు గురై బాలిక మృతి
పరిగి: మండలంలోని చిగురాలపల్లి గ్రామంలో అతిసార వ్యాధితో బాలిక మృతి చెందింది. శనివారం ఉదయం మూడో తరగతి చదువుతున్న శివనీల (8) పాఠశాలకు వెళ్లింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైంది. కుటుంబసభ్యులు స్థానిక వైద్యశిబిరంలో చికిత్స అందించారు. ఆదివారం ఉదయం ఒక్కసారిగా మళ్లీ వాంతులు, విరేచనాలు కావడంతో ప్రాణాలు కోల్పోయింది. ఎండీవో విజయప్ప, సీనియర్ ప్రజారోగ్య అధికారి ధశరథ గ్రామాన్ని సందర్శించి పరిస్థితులను పర్యవేక్షించారు.