ఐటీసీ పేపర్ మిల్లులో అగ్ని ప్రమాదం
ఖమ్మం,(జనంసాక్షి): బూర్గంపాడు మండలం సారపాకలో ఉన్న ఐటీసీ పేపర్ మిల్లులో ఇవాళ మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లోని డీజిల్ జనరేటర్ ప్లాంట్‌లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు.