నగరపాలక సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్న సీపీఐ
ఖమ్మం, కార్పొరేషన్: ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో నగరపాలక కార్యాలయం ఎదుల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ పట్టణ కార్యదర్శులు సలాం మాట్లాడుతూ నగరంలో పలు ప్రాంతాల్లో మురికి కాల్వల సమస్య ఎక్కువగా ఉందని, వీధి దీపాలు వెలగడం లేదని, విలీన పంచాయతీల్లో వెంటనే అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మయ్య, సాంబశివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.