యువజనోత్సవాలను ప్రారంభించిన కలెక్టరు
ఖమ్మం సంక్షేమం: జిల్లా యువజాన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి యువజనోత్సవాలను కలెక్టరు శ్రీనివాసశ్రీనరేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ యువ కళాకారులను ప్రోత్సహించేందుకు నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబరులో నిర్వహించే జిల్లా స్థాయి పోటీలకు నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సెట్కం సీఈఓ వెంకట రంగయ్య తదితరులు పాల్గొన్నారు.