కళాశాలలో రక్తదాన శిబిరం ప్రారంభించిన నారాయణ
అబ్దుల్లాపూర్‌మెట్: రక్త దానంతో తల సేమియా బాధిత చిన్నారులకు ప్రాణదానం చేయవచ్చునని తల సేమియా సికిల్ సెల్ సంస్థ ప్రతినిధి దుర్గ పేర్కొన్నారు. హయత్ నగర్ మండలం జాఫర్‌గుడలోని నారాయణ యంత్ర విద్య కళాశాలలో బుధవారం కళాశాల ప్రధానాచార్యులు అరుణ్‌మూర్తితో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో తల సేమియా బాధిత చిన్నారుల కోసం విద్యార్థులు రక్తదానం చేశారు. శిబిరంలో నోవా ఎంబీఏ కళాశాల ప్రధానాచార్యులు పీజే కృష్ణ, వైద్యబృందం పాల్గొన్నారు.