ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్
పూంచ్,(జనంసాక్షి): మళ్లీ పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పూంచ్ సెక్టర్‌లో భారత ఆర్మీపోస్టుపై కాల్పులకు తెగబడింది. అర్ధరాత్రి నుంచి పాక్‌సైన్యం ఈ తెల్లవారుజామున 3 గంటల వరకు కాల్పులు జరిపింది. ఈ కాల్పులకు ధీటుగా భారత సైన్యం ఎదుర్కొని తిప్పికొట్టింది.