కస్టమ్స్ అధికారి పేరుతో ఘరానా మోసం
రంగారెడ్డి,(జనంసాక్షి): శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘరానా మోసం చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారి పేరుతో మోసగాడు వాసుదేవ భార్గవ బంగారాన్ని తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ రూ. 4 కోట్లను దోచుకున్నాడు. ఈ కేసులో నిందితుడైన వాసుదేవ భార్గవను పోలీసులు అరెస్ట్ చేశారు.