పెద్దషాపూర్‌లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య
రంగారెడ్డి,(జనంసాక్షి): జిల్లాలోని శంషాబాద్ మండలం పెద్దషాపూర్‌లో దారుణం జరిగింది. గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.