మంచిర్యాల పట్టణంలో చైన్‌స్నాచింగ్
ఆదిలాబాద్,(జనంసాక్షి): మంచిర్యాల పట్టణంలోని శ్రీనివాస టాకిస్ రోడ్డులో చైన్‌స్నాచింగ్ జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలోంచి బైక్‌పై వచ్చిన దుండగులు ఐదు తులాల బంగారు గొలుసును లాకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.