అగ్ని ప్రమాదంలో కిరాణా దుకాణం దగ్ధం
కాప్రా,(జనంసాక్షి): హైదరాబాద్ ఓల్డ్ కాప్రాలోని బంజారాకాలనీలో మల్లుష్ కిరాణా దుకాణంలో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 2 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. విద్యుత్‌షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది.