సీఎంతో ఏపీ ఎన్టీవోల సమావేశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ ఎన్టీవోల నేతలు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఏపీఎన్టీవోల ఆందోళనలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సీఎంతో ఏపీ ఎన్టీవోల నేతలు సమావేశం కావడం ప్రధాన్యతను సంతరించుకుంది. మరో పక్క తెలంగాణ ఉద్యోగసంఘాల నేతలు ఏపీ ఎన్టీవోల ఆందోళనల వెనక సీఎం కిరణ్‌కుమార్‌ హస్తం ఉన్నట్లు ఆరోపిస్తున్నారు.