సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల శాంతి ర్యాలీ


హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి)
సచివాలయంలో తెలంగాణ ఉద్యోగు లు గురువారం శాంతి ర్యాలీ నిర్వ హించారు. కేంద్ర ప్రభుత్వం శాంతి యుతంగా తెలంగాణను ప్రకటిస్తే సీ మాంధ్ర ఉద్యోగులు మాత్రం తమను రెచ్చ గొట్టే విధంగా వ్యవహరిస్తున్నా రని వారు ఆరోపించారు. తెలంగాణ ను ఏర్పాటు నిర్ణయాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు శాంతి ర్యాలీ నిర్వహించారు ఉద్యోగులు. ఈసందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ  విడిపోయి కలిసి ఉందామనే ఉద్దేశ్యంతోనే ర్యాలీ చేస్తున్నామన్నారు. ఉద్యోగ పరమైన సమస్యలుంటే పరిష్కరించేందుకు తాము కూడా ముందుంటామని హామి ఇచ్చేందుకు ఈప్రయత్నం చేస్తున్నామన్నారు. చాలా మంది రెచ్చగొడుతూ  తెలంగాణవాదులను చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. ఇంతకాలం కలిసి ఉన్న వారమంతా రేపు విడిపోయినా గతంలో లాగే ఉండాలన్నదే తమ ఉద్దేశ్యమన్నారు. 60 సంవత్సరాల ఉద్యమన్ని తొక్కిపెట్టేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. రాజకీయ కారణాలతోనే సమ్మెకు నోటీసిచ్చారన్నారు. తెలంగాణాకు వ్యతిరేకం కాదని, హక్కుల కోసం అని, హైదరాబాద్‌పై హక్కు కావాలంటూ రోజుకో మాట మారుస్తున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకుల చేతిలో పడిపోవద్దన్నారు. గుర్తింపు లేని సంఘం పేరుతో సమ్మె నోటీసిచ్చి అనైతికతకు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఎం, లగడపాటి  ఉద్యమం వెనుక ఉన్నారని ఆరోపించారు. సీమాంధ్రలో ఉన్న తెలంగాణావారిపై దాడులు నివారించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిని ప్రతిఘటించేందుకే తాము శాంతి ర్యాలీ చేస్తున్నామన్నారు. తెలుగు పేరుతో తెగులు తెచ్చేందుకు సీమాంధ్రులు కుట్ర పన్నుతున్నారని గుర్తించి విడిపోయేందుకే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సీమాంధ్రుల ఎత్తుగడలను ధీటుగా పోరాడుతామని, కేంద్రం ప్రకటించిన తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసే వరకు కూడా తాము శాంతియుతంగానే నిరనసలు వ్యక్తం చేస్తామన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు ఎంత రెచ్చగొట్టినా కూడా శాంతియుతంగానే ఉంటామన్నారు.