సీమాంధ్ర ఉద్యమానికి దశా-దిశా లేదు : పెద్దిరెడ్డి
ఖమ్మం,(జనంసాక్షి): టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రజలకే కాదు యావత్ తెలుగు ప్రజలందరికీ మార్గదర్శిగా నిలబడే నాయకుడు అని ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి కొనియాడారు. సీమాంధ్ర ఉద్యమానికి దశా-దిశా లేదని విమర్శించారు. సీఎం కిరణ్, చంద్రబాబు సీమాంధ్రను పాలించే సత్తా లేక అక్కడి ప్రజలను రెచ్చగొడుతున్నారని చెప్పారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో పాసయ్యేంత వరకు ఇక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్దిరెడ్డి సూచించారు.