మంత్రి గీతారెడ్డిని ప్రశ్నించిన సీబీఐ

హైదరాబాద్‌,(జనంసాక్షి): జగన్‌ అక్రమాస్తుల కేసులో మంత్రి గీతారెడ్డిని ఆమె నివాసంలో మంగళవారం రాత్రి సీబీఐ విచారించింది. లేపాక్షి భూకేటాయింపులకు సంబంధించి ఆమెను సీబీఐ ప్రశ్నించింది. రెండు గంటల పాటు ప్రశ్నించినట్లు సమాచారం.