సచివాలయం, బీఆర్‌కే భవన్‌లో ఉద్రిక్తత


పోరుబిడ్డల సద్భావన దీక్ష
వలసదారుల పోటీ దీక్ష
విద్యుత్‌ సౌధ వద్ద టీ అడ్వకేట్‌ జేఏసీ నిజ నిర్ధారణ
అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) :
హైదరాబాద్‌లో మరోసారి సీమాం ధ్ర ఉద్యోగులు భయోత్పాతం సృష్టిం చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రశాం తంగా ఉంటున్న తెలంగాణ ఉద్యో గులను రెచ్చగొట్టేలా నినాదాలు, నిరసనలు చేస్తూ తెలంగాణ ఉద్యోగులను సైతం నిరసనలవైపుకు లాగుతున్నారు. బుధవారం కూడా సచివాలయంలో అలాంటి చర్యలే కొనసాగాయి.  తెెలంగాణ ఉద్యోగు లను రెచ్చగొట్టే విధంగా కార్యక్రమా లు చేపట్టారు. దీంతో సచివాలయంలోని తెలంగాణ ఉద్యోగులు, సీమాంధ్ర ఉద్యోగుల కవ్వింపు చర్యలను నిరసిస్తూ పార్లమెంట్‌లో వెంటనే తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్‌ చేస్తూ పోట ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ఉద్యోగుల సైతం ఆందోళనకు దిగడంతో సచివాలయంలో ఏమి జరుగుత్నుందోనన్న ఆందోళన నెలకొంది. ఈ సందర్భంగా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరుప్రాంత ఉద్యోగులు ఆందోళనలకు పిలపు ఇవ్వడంతో సచివాలయంలో ర్యాలీలు, ధర్నాలు, ప్రసంగాలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది అయినప్పటికీ ప్రభుత్వ ఉత్తర్వులను సీమాంధ్ర ఉద్యోగులు బేఖారు చేసి మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనిని నిరసిస్తూ తెలంగాణ ఉద్యోగులు బుధవారం నుంచి పెస్టెంబర్‌ 4 వరకు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వులుకు విరుద్ధంగా ఇరుప్రాంత ఉద్యోగులు ఆందోళనలకు దిగడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సచివాలయంలోని నల్లపోచమ్మ ఆలయం వద్ద సీమాంధ్ర ఉద్యోగులు హెచ్‌బ్లాక్‌ వద్ద తెలంగాణ ఉద్యోగులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. సీమాంధ్ర మంత్రులు రాజీనామాలు చేయాలని, రాష్ట్ర విభజన శాస్త్రీయంగా లేదని దానిని పునః సమీక్షించాలని సీమాంధ్ర ఉద్యోగులు నినాదాలు చేశారు. కాగా 60 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంత ప్రజలు నిర్వహిస్తున్న ఉద్యమాలను గౌరవించి యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజనకు పూనుకున్న వెంటనే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలని తెలంగాణ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగుల భద్రతకు తాము కట్టుబడి ఉంటామని,స్నేహ హస్తాన్ని అందుకోవాలని తెలంగాణ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్‌ నరేంద్రరావు విజ్ఞప్తి చేశారు. ప్రాంతాల విభజన వల్ల ఉద్యోగులకు ఎలాంటి నష్టంవాటిల్లదని వారి హక్కులకు భంగం కలగకుండా ఇరుప్రాంత ఉద్యోగులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ముందే కిందకి దిగిన సీమాధ్ర ఉద్యోగులు తెలంగాణవారిని కిందకు రాకుండా అడ్డుకోవడంతో కొంత తోపులాట కూడా జరిగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోటాపోటీ నినాదాలతో అటు సచివాలయం, ఇటు బీఆర్‌కె భవన్‌ మార్మోగింది. విద్యుత్‌ సౌధ వద్ద తెలంగాణ ఉద్యోగులు చేపడుతున్న ఆందోళన, వారిపై సీమాంధ్ర సర్కారు దాష్టీకంపై టీ అడ్వకేట్‌ జేఏసీ ప్రతినిధులు నిజనిర్ధారణకు వెళ్లారు. ఆందోళన నిర్వహిస్తున్న ఉద్యోగులకు సంఘీభావం తెలిపి నిజానిజాలు రాబట్టాలని వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని వెనక్కు పంపారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.