విద్యుత్ అధికారులను నిర్భంధించిన గ్రామస్థులు
మెదక్,(జనంసాక్షి): పుల్కట్ మండలం చౌటూరులో విద్యుత్ కోతలను నిరసిస్తూ విద్యుత్ అధికారులను గ్రామస్థులు నిర్భంధించారు. విద్యుత్ బిల్లుల వసూళ్లకు వచ్చిన అధికారులపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలు విధిస్తూనే బిల్లులు వసూలు చేయడం సబబు కాదన్నారు.