కంటోన్మెంట్‌ బస్‌ డిపో ఎదుట కార్మికుల ధర్నా

హైదరాబాద్‌,(జనంసాక్షి): జూబ్లీ బస్టాండ్‌లో కంట్రోలర్‌ వేధిస్తున్నారంటూ డ్రైవర్లు, కండక్టర్లు కంటోన్మెంట్‌ బస్‌ డిపో దుట ధర్నాకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు.  కంట్రోలర్‌ వేధింపులకు మనస్తాపానికి గురైన డ్రైవర్‌ వెంకట్‌ అక్కడే ఉన్న వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే తమసమస్యలు పరిష్కరించాలని లేకపోతే నగరంలోని అన్ని ఆర్టీసీ డిపోల బంద్‌కు పిలుపునిస్తామని కార్మికులు హెచ్చరించారు.