హింస నిరోధంలో ప్రజలు భాగస్వామ్యం కావాలి


అహింసా మెసెంజర్‌ను ప్రారంభించిన సోనియా
న్యూఢిల్లీ, ఆగస్టు 31 (జనంసాక్షి) :
దేశంలో మహిళలు, బాలలపై పెరిగిపోతున్న హింసను నియంత్రించేందుకు ప్రజలంతా సహకరించాలని భాగ స్వామ్యం కావాలని ఏఐసీసీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ పిలుపునిచ్చారు. ‘అహింసా మెసెంజర్‌’ పేరుతో కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ తలపెట్టిన జాతీయ ప్రచార కార్యక్రమాన్ని యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడుతూ కేవలం చట్టాలు, పోలీసులతోనే మహిళలపై అత్యాచారాలు, హింసను అడ్డుకోలేమన్నారు. చట్టాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయడం ఎంతో అవసరమన్నారు. పాత అభిప్రాయాలను దూరం చేసి, మహిళలకు పురుషులతో సమాన హోదా కల్పించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతో వుందన్నారు. ఇందుకోసం సామాజిక దృష్టి అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రాథమిక స్థాయి నుంచే మహిళలు, బాలల హక్కులపై అవగాహన కల్పిస్తారు. వీరి హక్కులకు భంగం కలిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలి. తదితర అంశాలపై ప్రచార కార్యక్రమం నిర్వహించననున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కృష్ణతిరణ్‌, కిశోర్‌ చంద్రదేవ్‌ తదితరులు పాల్గొన్నారు.