శాంతిర్యాలీ జరిపి తీరుతాం: కోదండరాం
వరంగల్: ఎట్టి పరిస్థితుల్లోనూ సీమాంధ్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ నిర్వహించి తీరుతామని రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం తెలిపారు. తెలంగాణ పై రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయితే తప్ప సీమాంధ్రుల కుట్రలు ఆగవని ఆయప పేర్కోన్నారు. తెలంగాణలో జరుగుతున్నది ప్రజల ఆందోళన అని తెలిపారు.