కారు,ట్రాలీ ఆటో ఢీ : ఒకరి మృతి

కొండపాక (మెదక్‌) : మెదక్‌ జిల్లా కొండపాక మండలం కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాజీవ్‌ రహదారిపై ట్రాలీ ఆటో ,కారు ఢీకోన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. కరీంనగర్‌ జిల్లా నెంబర్‌తో ఉన్న కారు హైదరాబాద్‌ వైపు వస్తూ ఆటోను ఓవర్‌టేక్‌ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది..