రాజేంద్రనగర్‌లో ఉద్రిక్తత
రంగారెడ్డి : రాజేంద్రనగర్ ఎన్జీరంగా విశ్వవిద్యాలయ విద్యార్థులు బంద్‌కు మద్దతుగా ఆందోళనకు దిగారు. రోడ్డుపై ఆందోళనకు దిగిన విద్యార్ధులపై తిరుపతి నుంచి వస్తున్న బస్సులపై రాళ్లువేశారని ఆరోపిస్తూ పోలీసులు లాఠీచార్జ్ చేశారు.దీంతో విద్యార్థులకు పోలీసులకు మద్య యుద్ద వాతావరణం ఏర్పడింది. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది.