ఆదిలాబాద్‌ జిల్లాలో బంద్‌ సంపూర్ణం

ఆదిలాబాద్‌్‌, సెప్టెంబర్‌ 7: రాజకీయ ఐకాస బంద్‌  శనివారం జిల్లాలో సంపూర్ణంగా, ప్రశాంతంగా  జరిగింది.  విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. ముఖ్యమంత్రి, డీజీపీలు వ్యవహరిస్తున్న పక్షపాత వైఖరికి నిరసనగా జిల్లావ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున తెలంగాణవాదులు వివిధ పట్టణాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రోడ్లమీదకు వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాలోని ఆరు డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు తెల్లవారుజామున 5 గంటలకు ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు నల్లబ్యాడ్జిలు ధరించి విధులను బహిష్కరించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలలో దుకాణాలు, హోట్లు, పెట్రోల్‌ బంకులు, బ్యాంకులు, ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలల, కళశాలు బంద్‌ పాటించారు. న్యాయవాదులను విధులను బహిష్కరించారు. సింగరేణి ప్రాంతంలో కార్మికులు నల్లబ్యాడ్జిలు ధరించి విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ఆరు డిపోలలో 590 బస్సులు నిచిపోయాయి. ప్రభుత్వ దమణ నీతికి నిరసనగా అన్ని వర్గాల ప్రజలు, వివిధ కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, బీజేపీ, టీఆర్‌ఎస్‌, సీపీఐ (ఎంఎల్‌) సంఘాలు బంద్‌కు సంపూర్ణ మద్దతు పలికాయి. ప్రైవేట్‌ జీబులు, ఆటో రిక్షలు సైతం బంద్‌ పాటించాయి. ఆదిలాబాద్‌, నిర్మల్‌, కాగజ్‌నగర్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, బైంసా, ఉత్నూర్‌, బోత్‌, విచ్చోడ  తదితర ప్రాంతాలలో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి , డీజీపీలు అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతూ సీమాంధ్ర పక్షపార్టీగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులు దుయ్యబట్టారు. ప్రజలు స్వచ్చందంగా బంద్‌లో పాల్గొనడంతో శనివారం జిల్లాలో ప్రశాంతంగా, విజయవంతంగా కొనసాగింది.