ఖమ్మం జిల్లాలో తాగునీరు నిలిపివేత
ఖమ్మం : జిల్లాలోని పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి, కల్లూరు మండలాల్లో తాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడింది. వేతనాలు అందలేదని ఫ్లోరైడ్ రహిత పథకం సిబ్బంది నీటి పరఫరాను నిలిపివేసింది. తమకు వేతనాలు చెల్లించాలని ఫ్లోరైడ్ రహిత పథకం సిబ్బంది ఆందోళనకు దిగింది. తాగు నీరు నిలిపివేయడంతో 82 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.