తాగునీటి సరాఫరా నిలిపివేత : గుక్కెడు నీటికోసం ఇబ్బందులు పడుతున్న జనం

సంగారెడ్డి : సత్యసాయి తాగునీటి పథకానికి నిధుల గ్రహణం పట్టుకుంది. పధకం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా 157 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. మరోవైపు తమకు వేతనాలు ,ఎరియర్స్‌ చెల్లించాలంటూ కార్మికులు సమ్మెకు దిగారు. సత్యసాయి తాగునీటి పథకం ద్వారా జిల్లాలో 157 గ్రామాలకు తాగు నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ తాగునీటి పథకాల నిర్వహణ బాధ్యతను ఎల్‌అండ్‌ఈ సంస్ధకు కాంట్రాక్టు పద్దతిలో అప్పగించారు.అయితే ఈ సంస్ధకు ఏడాదికాలంగా ప్రభుత్వం నిధులు కేటాయించడంలేదు. కాగా నిధుల విడుదలకు ముడపుల బాగోతం అడ్డుపడుతుందని కార్మికులు ఆరోపిస్తున్నారు.