ప్రమాదవాశాత్తు చెరువులో పడి యువకుడి మృతి

చేగుంట : మండలానికి చెందిన నజీర్‌ (20) అనే యువకుడు చెరువులో పడి మృతిచెందాడు. పశువులను మేపేందుకు గుండుచెరువు ప్రాంతానికి తీసుకెళ్లిన అతను చెరువులో దిగాడు. ఈత రాకపోవడంతో అతను మృతిచెందాడు. సాయంత్రం అతను ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చెరువుకు వెళ్లి చూడగా నజీర్‌ విగతజీవుడిగా కనిపించాడు.