ఇందిరమ్మ ఇళ్లకు నిధుల గ్రహణం
కొత్తగూడెం (ఖమ్మం) : రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతిపేదవాడికి ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని చెప్పిన మాటలు నీటిమాటలేనని తేలిపోయాయి.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయక కొసరి కొసరి నిధులను మంజూరు చేస్తూ ,అందులోంచి పేదల జేబులోంచి చిల్లులు ఎలా వేయాల అని శతవిధాల ప్రయత్నిస్తుంది.అందులో భాగంగానే లభ్దిదారుల బిల్లునుంచి మినహాయించుకునేలా అడ్మినిస్టేషన్ చార్జీలను ఆమాంతం మూడు రేట్లు పెంచేసింది.